చంద్రబాబు దొంగ మాటలు చెబుతున్నారు : జగన్ 8 h ago
AP: చంద్రబాబు, లోకేష్, పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌సీపీ నేత జగన్. చంద్రబాబుకు జాకీలు పెట్టి లోకేష్ లేపుతాడని, లోకేష్‌కు చంద్రబాబు జాకీలు పెట్టి లేపుతాడని, వీరిద్దరికీ పవన్ జాకీలు పెట్టి లేపుతాడని విమర్శించారు. ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏం చేస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదని, అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది ఏమీ లేదని తెలిపారు.